Skip to main content

పాత బొగ్గుల బుట్ట

ఒకానొక కొండప్రాంతంలో, ముసలివాడైన ఒక వ్యక్తి మనవడితో పాటూ తన పొలంలోనే ఉంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. ఆయన ప్రతీరోజూ ప్రొద్దుటే లేచి, కిచెన్ లో ఉన్న టేబుల్ పై కూర్చుని, బైబిల్ చదువుకుంటూ ఉండడం మనవడు గమనిస్తుండేవాడు. వాడు కూడా తన తాతలాగానే ఉండేందుకు ప్రయత్నిస్తుండేవాడు. అందుకోసం అన్నిరకాలుగా తాతయ్యను అనుకరిస్తూ ఉండేవాడు.

ఒకరోజు వాడు తాత దగ్గరకి వచ్చి 'తాతయ్యా.. తాతయ్యా.. నేను కూడా నీలానే బైబిల్ చదివేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ, ఎంత చదివినా బైబిల్ నాకేం అర్ధం కావట్లేదు. ఒకవేళ ఏమైనా కొంచెం అర్ధమైనా కూడా, అది బైబిల్ మూసే లోపు మర్చిపోతున్నాను. తాతయ్యా, నాకొక విషయం చెప్పు. బైబిల్ చదవడం వల్ల ఏమంత ప్రయోజనం ఉంది?' అని ప్రశ్నించాడు.

పొయ్యిలో బొగ్గులు వేసిన తాతయ్య, మౌనంగా పక్కకి తిరిగి, 'ముందు బొగ్గుల బుట్టని తీసుకెళ్ళి, కింద ఉన్న చెరువు దగ్గరకి పోయి, నాకు కొన్ని నీళ్ళు తీసుకురా..' అని బదులిచ్చాడు.

సరేనంటూనే తాతయ్య చేతిలోనున్న పాత బొగ్గుల బుట్టని తీసుకుని, చెరువుకు పోయి బుట్టలో నీరు నింపి ఇంటికొచ్చాడు. కానీ, వాడు ఇంటికి చేరుకునే లోపే బుట్టలో నింపిన నీళ్ళు కాస్తా మొత్తం కారిపోయాయి. తెల్లబోయిన మనవడి మొహం చూసిన తాతయ్య, నవ్వి, 'అయితే, సారి నువ్వు మరింత వేగంగా పరుగెత్తుకుంటూ ఇంటికి రావాలి.' అని చెప్పి, మరల ప్రయత్నించమని మనవడ్ని బుట్టతోనే చెరువు దగ్గరకి పంపించాడు.

ఈసారి వాడు త్వరత్వరగా పరుగెత్తుకుని ఇంటికైతే చేరుకున్నాడు కానీ, మళ్ళీ బుట్ట కాస్తా ఖాళీ అయిపోయింది. నివ్వెరబోయి, ఆయాసంతో ఊపిరి పీల్చుకుంటూ వాడు, బుట్టతో నీళ్ళు తీసుకురావడం అస్సలు వీలుకాని పనని తాతకి చెప్పేసి, బుట్టకి బదులు బకెట్ కోసం వెతుకడం మొదలెట్టాడు.


ఈలోగా తాత 'నాకు నీళ్ళు కావాల్సింది బకెట్ తో కాదు గానీ బుట్టతోనే కావాలి. నువ్వు సరిగ్గా ప్రయత్నించి ఉంటే తేగలిగేవాడివి' అంటుంటే, వాడు మరల బుట్టనే పట్టుకుని మరల ప్రయత్నిస్తుండగా, దగ్గరుండి చూసేందుకు తాత ఇంటి బయటికి వెళ్లి గుమ్మంలోనే నిలబడ్డాడు.

ఈసారి బుట్టతో నీళ్ళు తీసుకురావడం అసాధ్యమని మనవడికి తెల్సినప్పటికీ, నీళ్ళు కారిపోవడంలో తన లోపం ఏమీ లేదని, తన శక్తికి మించి ఎంత వేగంగా పరుగెత్తినప్పటికీ ఇంటికొచ్చేసరికి నీళ్ళెలా కారిపోతున్నాయో తాతయ్యకు నేరుగా చూపించాలనుకున్నాడు.

మరల చెరువులో ముంచిన బుట్టను పైకిలేపి, వెనక్కి తిరిగి వేగంగా ఇంటికి పరుగు మొదలెట్టాడు. కానీ, మళ్ళీ వాడు తాతయ్య దగ్గరకి చేరుకునే లోపే బుట్ట మొత్తం ఖాళీ అయిపొయింది. ఆయాసపడుతూ, ' చూసావా తాతయ్యా.. ఇదెంత వృధా పనో. నేను చెప్తే నువ్ నమ్మలేదు కదా. బుట్టతో నీళ్ళు తేవడం అసలు వీలుకానే కాదు' అన్నాడు.


అందుకు తాత 'అయితే నువ్వు ఇదంతా వృధా పని అనుకుంటున్నావ్ కదా. ఇంతసేపూ నువ్వు బుట్టలో నీళ్ళు నిలిచి ఉండటంలేదనే బాధపడుతున్నావ్ కానీ, ఒక్కసారైనా బుట్టని సరిగ్గా గమనించి చూసావా..?' అని ప్రశ్నించాడు. అప్పుడు వాడు బుట్టకేసి చూసినప్పుడు, మొదటిసారిగా అది చాలా కొత్తగా కనిపించడం గమనించాడు. నల్లగా, ఎంతో మురికిగా ఉండే పాత బొగ్గుల బుట్ట కాస్తా, లోపలా బయటా మురికంతా వదిలిపోయి చాలా తెల్లగా మారిపోయింది.

అప్పుడు తాతయ్య 'ఒరేయ్ బాబూ.. చూసావా. నువ్వు బైబిల్ చదివుతున్నప్పుడు కూడా సరిగ్గా ఇలానే జరుగుతుంది. బైబిల్ చదువుతున్నపుడు నీకేం అర్ధం కాకపోవచ్చు, లేదా నీకేం గుర్తుండకపోవచ్చు. కానీ, నీ అంతరంగంలోనూ, బాహ్యంగానూ నీ జీవితం మార్పు చెందుతూ ఉంటుంది. దేవుని వాక్యం నీకున్న మురికినంతటినీ, శుభ్రం చేస్తుంటుంది. ఇలా నీ జీవితం పరిశుద్ధంగా మార్చబడుతూ, మెల్లగా యేసయ్యా రూపంలోకి మార్చబడతావ్. మనల్ని శుద్దీకరించేందుకు వాక్యమైయున్న యేసు చేసే పని అదే.' అని చెప్పాడు.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . 

నిజమే కదా. మనం కూడా వాక్యంలో స్నానం చేయకపోతే మురికిపట్టి, మలినమైపోతుంటాం. మన జీవితం అనేకులకు దుర్వాసన కొట్టేదిగా ఉంటుంది. మన పాపపు తలంపులు, ఆలోచనలు, నడతలు ఆయన వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు శుద్దిచేయబడి, సరిచేయబడాలి. మనకెంత బైబిల్ పాండిత్యం ఉన్నదో, మనలో వాక్యం ఎంత నిండి ఉన్నదోనని దేవుడు చూడడు కానీ, మన జీవితం ఎంత పరిశుద్ధంగా ఉన్నదనే చూస్తాడు. అందుకే మనం ప్రతిరోజూ తప్పక బైబిల్ చదివేందుకు తగిన సమయాన్ని తప్పక కేటాయించాలి.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . 






దేవుని వాక్యం  విధంగా తేట పరుస్తుంది.
కీర్తనలు 119:9 - 'యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?' 


ఎఫెసీయులకు 5:25-27 - 'అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను 
మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దాని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దాని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై 
దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.

Comments

Popular posts from this blog

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను . ఎప్పుడైనా ఎవరైనా తమ పాపక్షమాపణ నిమిత్తము సర్వలోక రక్షకుడైన యేసుని వెతుకుతుంటే.... వారు తెలుసుకోవలసిన విషయము ఏమిటంటే; యేసు కూడా వారి కోసము వెతుకుతున్నారు అని. చూడండి.... జక్కయ్య అనే వ్యక్తి ఉన్నారు.... ఈ జక్కయ్య యేసు కోసము వెతుకుచున్నారు; కానీ ఈ జక్కయ్యకి కూడా తెలియని విషయము ఏమిటంటే....? యేసు కూడా ఈ జక్కయ్య కోసమే వెతుకుతున్నారు. . . . అందుకే తన ముందు గుంపులు గుంపులుగా జనం ఉన్నా యేసు జక్కయ్య దగ్గరికి వచ్చి ఆగారు. అంతకుముందు యేసుని జక్కయ్య చూడలేదు.... వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవలేదు.... కానీ; యేసయ్యకు తెలుసు యెరికొలో మరోక ఆత్మ రక్షణ కోసం ఎదురుచూస్తుందని.... యేసయ్యకు తెలుసు అతను జనముచేత పాపిగా పిలువబడే సుంకపుగుత్తదారుడని.... యేసుక్రీస్తు వారికి తెలుసు అతను పొట్టివాడని; అందుకే చెట్టు ఎక్కాడని, అతని పేరు జక్కయ్య అని. . . . అందుకే వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవకపోయినా యేసయ్య అతనిని పేరు పెట్టి పిలిచారు. జక్కయ్య కోసము వెతుకుతూ అతను దాగివున్న చోట ఆగి మరీ పట్టుకున్నారు. అక్కడి ప్రజలు జక్కయ్య గురించి ఏమి అనుకుంటున...

Devinelu Stotrarhudaa Yesayya - Digiraanaiyuna Maharajvu Neevayya

దివినేలు స్తోత్రర్హుడా యేసయ్య  దిగిరానైయున్నా మహారాజువు నీవయ్య మొదటివాడవు కడపటివాడవు  యుగయుగములలో ఉన్నవాడవు 1.        మా నక నాయెడల కృప చూపుచున్నావు మారదు  నీ ప్రేమ తరతరములకు  మాటతప్పని మహనీయుడవు మార్పులేనివాడవు నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు నీ మాటలు జీవపు ఉటలు నీ కృపయే బలమైన కోటలు 2.        దా చక నీ సంకల్పము తెలియచేయుచున్నావు దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు దాటివెళ్లని కరుణామూర్తివై మనవి అలకించావు దీర్ఘశాంతముగలవాడవై దీవించువాడవు నీ దీవెన పరిమళ సువాసన నీ ఘనతే స్దిరమైన సంపద 3.       సి యోను శిఖరముపై ననునిలుపుటకై జే ష్ట్యుల    సంఘముగ నను మార్చుటకే   దివ్యమైన ప్రత్యక్షతతో నన్ను నిలిపియున్నావు సుందరమైన నీ పోలికగా రూపుదిద్దిచున్నావు నీ రాజ్యమే పరిశుద్ద నగరము ఆ రాజ్యమే నిత్య సంతోషము  

ఎవరు మంచి వారు .... ?

ఎవరు మంచి వారు .... ?