ఒకానొక కొండప్రాంతంలో , ముసలివాడైన ఒక వ్యక్తి మనవడితో పాటూ తన పొలంలోనే ఉంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు . ఆయన ప్రతీరోజూ ప్రొద్దుటే లేచి , కిచెన్ లో ఉన్న టేబుల్ పై కూర్చుని , బైబిల్ చదువుకుంటూ ఉండడం ఆ మనవడు గమనిస్తుండేవాడు . వాడు కూడా తన తాతలాగానే ఉండేందుకు ప్రయత్నిస్తుండేవాడు . అందుకోసం అన్నిరకాలుగా తాతయ్యను అనుకరిస్తూ ఉండేవాడు . ఒకరోజు వాడు తాత దగ్గరకి వచ్చి ' తాతయ్యా .. తాతయ్యా .. నేను కూడా నీలానే బైబిల్ చదివేందుకు ప్రయత్నిస్తున్నాను . కానీ , ఎంత చదివినా బైబిల్ నాకేం అర్ధం కావట్లేదు . ఒకవేళ ఏమైనా కొంచెం అర్ధమైనా కూడా , అది బైబిల్ మూసే లోపు మర్చిపోతున్నాను . తాతయ్యా , నాకొక విషయం చెప్పు . బైబిల్ చదవడం వల్ల ఏమంత ప్రయోజనం ఉంది ?' అని ప్రశ్నించాడు . పొయ్యిలో బొగ్గులు వేసిన తాతయ్య , మౌనంగా పక్కకి తిరిగి , ' ముందు ఈ బొగ్గుల బుట్టని తీసుకెళ్ళి , కింద ఉన్న చెరువు దగ్గరకి పోయి , నాకు కొన్ని నీళ్ళు తీసుకురా ..' అని బదులిచ్చాడు . సరేనంటూనే తాతయ్య చేతిలోనున్న ఆ పాత బొగ్గుల బుట్టని ...