ఒకరోజు సాతాను ఒక ఇంట్లో.. తెల్లని గోడ మీద తేనె చుక్క ఒకటి వేలితో అంటించి పక్కకి వెళ్ళిపోయి , జరిగబోయే వేడుక చూడాలని ఆరాటంగా ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈలోగా అటుగా చీమ ఒకటి వచ్చి , తేనె చుక్కని చూసి , తేనెను తినడం మొదలెట్టింది. ఇది గమనించిన గోడ మీది బల్లి ఒకటి ఆ చీమని తినడానికి వచ్చింది.బల్లి కోసం ఎలుక వచ్చింది. ఎలుకను చూసి , దాన్ని ఎలాగైనా పట్టి , చంపి తినెయ్యాలని ఆ ఇంట్లోకి పిల్లి కూడా వచ్చేసింది. పిల్లిని ఎలుక ఇల్లంతా కలియ పరుగెత్తించ మొదలెట్టింది. ఈలోగా పక్కింటి కుక్క , ఇదంతా చూసేసింది. భలే ఛాన్స్ దొరికిందనుకుని ఉన్న పాటున ఈ ఇంట్లోకి పరుగులెత్తింది. కుక్కని చూసిన పిల్లి గుండెలు అదిరిపడ్డాయి. ఎలకని వదిలి ప్రాణాలు కాపాడుకోవటం కోసం పిల్లి పరుగులంకించుకుంది. ఇలా కుక్క , పిల్లి ఒకదాని వెనక ఒకటి పరుగెత్తి పరుగెత్తీ కాసేపటికే ఇల్లంతా గందరగోళం చేసేసి , ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ పగులగొట్టేస్తూ ఉన్నాయ్. దీంతో ఇల్లంతా పెద్దగా శబ్దాలు మారుమోగిపోతూ ఉంటే , ఉన్న పాటున నిద్రలే...