దివినేలు
స్తోత్రర్హుడా యేసయ్య దిగిరానైయున్నా మహారాజువు నీవయ్య
మొదటివాడవు కడపటివాడవు
యుగయుగములలో ఉన్నవాడవు
1. మానక నాయెడల కృప చూపుచున్నావు
మారదు నీ ప్రేమ
తరతరములకు మాటతప్పని మహనీయుడవు మార్పులేనివాడవు
నీవు చెప్పిన మంచి
మాటలు నెరవేర్చువాడవు
నీ మాటలు జీవపు ఉటలు
నీ కృపయే బలమైన కోటలు
2.
దాచక
నీ సంకల్పము తెలియచేయుచున్నావు
దయనొందిన నీ జనుల
ముందు నడుచుచున్నావు
దాటివెళ్లని
కరుణామూర్తివై మనవి అలకించావు
దీర్ఘశాంతముగలవాడవై
దీవించువాడవు
నీ దీవెన పరిమళ సువాసన
నీ ఘనతే స్దిరమైన సంపద
3. సియోను శిఖరముపై ననునిలుపుటకై
జేష్ట్యుల సంఘముగ
నను మార్చుటకే
దివ్యమైన ప్రత్యక్షతతో
నన్ను నిలిపియున్నావు
సుందరమైన నీ పోలికగా
రూపుదిద్దిచున్నావు
నీ రాజ్యమే పరిశుద్ద
నగరము
ఆ రాజ్యమే నిత్య
సంతోషము
Comments
Post a Comment