Skip to main content

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను.

ఎప్పుడైనా ఎవరైనా తమ పాపక్షమాపణ నిమిత్తము సర్వలోక రక్షకుడైన యేసుని వెతుకుతుంటే.... వారు తెలుసుకోవలసిన విషయము ఏమిటంటే; యేసు కూడా వారి కోసము వెతుకుతున్నారు అని.

చూడండి.... జక్కయ్య అనే వ్యక్తి ఉన్నారు....
ఈ జక్కయ్య యేసు కోసము వెతుకుచున్నారు; కానీ ఈ జక్కయ్యకి కూడా తెలియని విషయము ఏమిటంటే....? యేసు కూడా ఈ జక్కయ్య కోసమే వెతుకుతున్నారు. . . .
అందుకే తన ముందు గుంపులు గుంపులుగా జనం ఉన్నా యేసు జక్కయ్య దగ్గరికి వచ్చి ఆగారు.

అంతకుముందు యేసుని జక్కయ్య చూడలేదు.... వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవలేదు....
కానీ; యేసయ్యకు తెలుసు యెరికొలో మరోక ఆత్మ రక్షణ కోసం ఎదురుచూస్తుందని....
యేసయ్యకు తెలుసు అతను జనముచేత పాపిగా పిలువబడే సుంకపుగుత్తదారుడని....
యేసుక్రీస్తు వారికి తెలుసు అతను పొట్టివాడని; అందుకే చెట్టు ఎక్కాడని, అతని పేరు జక్కయ్య అని. . . .

అందుకే వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవకపోయినా యేసయ్య అతనిని పేరు పెట్టి పిలిచారు. జక్కయ్య కోసము వెతుకుతూ అతను దాగివున్న చోట ఆగి మరీ పట్టుకున్నారు.

అక్కడి ప్రజలు జక్కయ్య గురించి ఏమి అనుకుంటున్నారో యేసయ్యకి అవసరంలేదు.
"యేసు ఎవరో" తెలుసుకోవాలి అని జక్కయ్యలో వున్నా ఆశని మాత్రమే యేసయ్య లక్ష్యపెట్టారు.
అందుకే అతని అక్కర తీర్చగోరి ప్రేమపూర్వకముగా చెట్టుదిగి రమ్మని పిలిచారు.

ఆ పిలుపు విన్న వెంటనే జక్కయ్య దిగివచ్చాడు, రక్షకుడైన యేసుని హత్తుకుని తన ఇంటిలోనికి మరియు తన హృదయములోనికి ఆహ్వానించాడు.

అప్పుడు యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళటము అక్కడ చాలామందికి నచ్చలేదు కానీ యేసుకు నచ్చింది ఆ ఒకటే.... "పాపి రక్షించబడాలి" యేసయ్య ప్రత్యేకముగా అందుకోసమే పరము నుండి దిగివచ్చారు. అవును, అందుకే యేసు జక్కయ్యతో ఇలా అన్నరు "నేడు నీ ఇంటికి రక్షణ వచ్చివున్నది, నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను" అని ( లూకా 19:10 ).

జక్కయ్య తను నశించినస్థితిలో ఉన్నానని గ్రహించాడు; అందుకే యేసయ్య పిలుపు వినగానే దిగి వచ్చాడు, చెట్టు దిగి వచ్చాడు, తన అధికారాన్ని విడిచి వచ్చాడు, తన పాపపు స్వభావాన్ని వదిలివచ్చాడు. . . .

ఆ పిలుపుకి జక్కయ్య స్పందించకపోయుంటే....? దిగ రాకపోయుంటే....?
అతనికి రక్షణ పొందే ఆ అవకాశము శాశ్వతంగా చేయిజారిపోయేది,
ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులవారు ఆ తరువాత మళ్ళి ఎప్పుడు యెరికోకి వెళ్ళలేదు.

జక్కయ్య తనకి వచ్చిన మొదటి అవకాశాన్నే సద్వినియోగం చేసుకున్నాడు.
జక్కయ్య యేసయ్యను సంతోషముగా చేర్చుకున్నాడు.
దేవునితో తెగిపోయిన తన సంబంధాన్ని తిరిగి కొనసాగించాడు.
తన ఇంటిలో.... తన హృదయములోను శాశ్వత సమాధాన్ని పొందుకున్నాడు.
ప్రియ దైవజనమా ఇంకా యేసయ్యకు వ్యతీరేకంగా జీవిస్తున్నావా? ఒకవేళ నామాకార్థ జీవితాన్ని కల్గి ప్రజల ముందు నటిస్తున్నావేమో? ఇదిగో రక్షకుడు నిన్ను ఆహ్వనిస్తున్నాడు..
జక్కయ్యను పిలిచి,తన ఇంటికి వెళ్లిన మన ప్రభువు  నీ హృదయములోనికి,నీతో ఉండి నిన్ను దీవించుటకు, ఆయన మార్గములో నడిపించుటకు నిన్ను కూడ పిలుస్తున్నాడు,,సమయము లేదు,, *త్వరపడు తద్వార యేసయ్యతో ఆ నిత్యరాజ్యములో ఉండే కృపను పొందుకుంటావు
అట్టి కృప ధన్యత సర్వాధికారి,సర్వసృష్టి కర్తయైన దేవుడు మనకు దయచేయును గాక !!! ఆమెన్

హల్లెలూయ. . . .

మన రక్షకుడైన యేసుక్రీస్తును గూర్చిన ఈ సువార్త  మనలను వాక్యంలో స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తు ద్వారా, నిరంతరము మహిమకలుగునుగాక.
ఆమేన్‌. ఆమేన్. ఆమేన్.

Comments

Popular posts from this blog

Calvary