Skip to main content

Dhavalavarnudaa Ratnavarnudaa

దవలవర్ణుడా రత్నవర్ణుడా   పదివేలలో అతిప్రియుడా   అతి కాంక్షనీయుడా (2)
ఎందుకయ్యా మాపై ప్రేమ ఎందుకయ్యా మాపై కరుణ (2)
ఘోర పాపినైన నన్ను లోకమంతా వెలివేసినా అనాథగా ఉన్న నన్ను ఆప్తులంతా దూషించగా (2)
నీ ప్రేమ నన్నాదుకొని నీ కరుణ నన్నోదార్చెను (2)
గాయములతో ఉన్న నన్ను స్నేహితులే గాయపరచగా రక్తములో ఉన్న నన్ను
బంధువులే వెలివేసినా (2)
నీ రక్తములో నను కడిగి నీ స్వారూపము నాకిచ్చితివా (2)
అర్హత లేని నన్ను నీవు అర్హునిగా చేసితివి
నీ మహిమలో నిలబెట్టుటకు నిర్దోషిగా చేసితివి (2)

నీ సేవలో నను వాడుకొని  నీ నిత్య రాజ్యము చేర్చితివి (2)        ||దవలవర్ణుడా||


Comments

Popular posts from this blog

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను . ఎప్పుడైనా ఎవరైనా తమ పాపక్షమాపణ నిమిత్తము సర్వలోక రక్షకుడైన యేసుని వెతుకుతుంటే.... వారు తెలుసుకోవలసిన విషయము ఏమిటంటే; యేసు కూడా వారి కోసము వెతుకుతున్నారు అని. చూడండి.... జక్కయ్య అనే వ్యక్తి ఉన్నారు.... ఈ జక్కయ్య యేసు కోసము వెతుకుచున్నారు; కానీ ఈ జక్కయ్యకి కూడా తెలియని విషయము ఏమిటంటే....? యేసు కూడా ఈ జక్కయ్య కోసమే వెతుకుతున్నారు. . . . అందుకే తన ముందు గుంపులు గుంపులుగా జనం ఉన్నా యేసు జక్కయ్య దగ్గరికి వచ్చి ఆగారు. అంతకుముందు యేసుని జక్కయ్య చూడలేదు.... వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవలేదు.... కానీ; యేసయ్యకు తెలుసు యెరికొలో మరోక ఆత్మ రక్షణ కోసం ఎదురుచూస్తుందని.... యేసయ్యకు తెలుసు అతను జనముచేత పాపిగా పిలువబడే సుంకపుగుత్తదారుడని.... యేసుక్రీస్తు వారికి తెలుసు అతను పొట్టివాడని; అందుకే చెట్టు ఎక్కాడని, అతని పేరు జక్కయ్య అని. . . . అందుకే వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవకపోయినా యేసయ్య అతనిని పేరు పెట్టి పిలిచారు. జక్కయ్య కోసము వెతుకుతూ అతను దాగివున్న చోట ఆగి మరీ పట్టుకున్నారు. అక్కడి ప్రజలు జక్కయ్య గురించి ఏమి అనుకుంటున...

Calvary