Skip to main content

ఆ రోజులే బాగున్నాయ్ !

ఆ రోజులే బాగున్నాయ్ !
�----------�----------�

టెన్షన్లు..
ఒత్తిళ్లు...
డబ్బు సంపాదన...
అతిగా ఆలోచనలు లేకుండా...
ఉన్నంతలో కుటుంబమంతా కలసి...
ఆనందంగా గడిపిన .
�ఆ రోజులు బాగున్నాయ్..!

ఆదివారం
ఆటలాడుతూ...
అన్నాన్ని మరచిన
�ఆ రోజులు బాగున్నాయ్..!

మినరల్ వాటర్ గోల లేకుండా...
కుళాయి దగ్గర,
బోరింగుల దగ్గర,
బావుల దగ్గర...
నీళ్లు తాగిన...
�ఆ రోజులు బాగున్నాయ్..!

ఎండాకాలం
చలివేంద్రాల్లోని చల్లని నీళ్లకోసం..
ఎర్రని ఎండను సైతం
లెక్కచేయని...
�ఆ రోజులు బాగున్నాయ్..!

వందలకొద్దీ చానెళ్లు లేకున్నా...
ఉన్న ఒక్క దూరదర్శన్ లో
శుక్రవారం చిత్రలహరి...
ఆదివారం సినిమా కోసం వారమంతా...
ఎదురు చూసిన
� ఆ రోజులు బాగున్నాయ్..!

సెలవుల్లో
అమ్మమ్మ..
నానమ్మల ఊళ్లకు వెళ్లి...
ఇంటికి రావాలనే ఆలోచన లేని...
� ఆ రోజులు బాగున్నాయ్..!

ఏసీ కార్లు లేకున్నా
ఎర్రబస్సుల్లో...
కిటికీ పక్క సీట్లో నుండి
ప్రకృతిని ఆస్వాదించిన
� ఆ రోజులు బాగున్నాయ్...!

మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా...
బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ...
చాక్లెట్లు పంచిన
� ఆ రోజులు బాగున్నాయ్..!

మటన్ బిర్యానీ..
చికిన్ బిర్యానీ లేకున్నా...
ఎండాకాలం వచ్చిందంటే
మామిడి కాయ పచ్చడితో...
అందరం కలసి
కడుపునిండా అన్నం తిన్న...
� ఆ రోజులు బాగున్నాయ్..!

ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా...
పరుసు నిండా డబ్బులున్నా...
కొట్టుకు పంపితే ...
మిగిలిన చిల్లర కాజేసిన
� ఆ రోజులే బాగున్నాయ్..!

సెల్లు నిండా గేములున్నా...
బ్యాట్ మార్చుకుంటూ
ఒకే బ్యాట్ తో క్రికెట్టాడిన..
� ఆ రోజులే బాగున్నాయ్...!

ఇప్పుడు బీరువా నిండా జీన్సు ప్యాంట్లున్నా...
రెండు నిక్కర్లతో బడికెళ్లిన...
� ఆ రోజులే బాగున్నాయ్..!

ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా... .
ఐదు పైసల ఆశా చాక్లెట్ తిన్న...
� ఆ రోజులే బాగున్నాయ్...!

చిన్న చిన్న మాటలకే దూరం పెంచుకుంటున్న ఈ రోజుల్లో..
పిల్లలం కొట్టుకున్నా
పెద్దలంతా కలసివుండే
� ఆ రోజులే బాగున్నాయ్..!

ఇప్పుడు ఇంటినిండా తినుబండారాలున్నా...
నాన్న కొనుక్కొచ్చే ...
చిరుతిళ్ళ కోసం ఎదురు చూసిన..
� ఆ రోజులే బాగున్నాయ్..!

ఇప్పుడు రకరకాల
ఐస్ క్రీమ్ లు చల్లగా నోట్లో నానుతున్నా...
అమ్మ చీరకొంగు పైసలతో
పుల్ల ఐసు కొనితిన్న...
�ఆ రోజులు ఎంతో బాగున్నాయ్..!

పొద్దుపోయేదాకా
చేలో పని చేసుకొచ్చి...
ఎలాంటి చీకూచింత లేకుండా..
ఎండాకాలంలో ఆకాశంలోని
చందమామను చూస్తూ నిదురించిన..
� ఆ రోజులు బాగున్నాయ్..!

�ఆ రోజులు బాగున్నాయ్...�
�ఆ రోజులు ఎంతో బాగున్నాయ్...�
 ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది
అమ్మ, నాన్న,....
అక్క బావ...
చెల్లి మర్ది....
అన్న వదిన....
తమ్ముడు మర్దలు....
మేనత్త మేనమామ....
పిన్ని బాబాయ్.....
పెద్దమ్మ పెదనాన్న....
తాతయ్య అమ్మమ్మ....
తాతయ్య నానమ్మ.....
ఒదిన, మరదలు....
బావ బామ్మర్ధి.....
ఇంకా....
ముత్తాత తాతమ్మ....
ఇలా వరుసలు ఉన్నాయని.... ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....
మమ్మి డాడి..... ఆంటీ అంకుల్
ఇవి రెండు తెలిస్తే చాలు....
ప్రపంచమంతా మన బందువులే అనే భావన ఏర్పడింది.
రక్త సంభందం అంటే ఏంటో తెలియని దుస్తితి....
కారణం.....
పుట్టగానే పిల్లలను క్రెచ్చ్ ల్లో వేయడం....
లేదా ఆయాలకు అప్పగించడం...
అందాలకు బందీలై తల్లి పాలు కూడా ఇవ్వకపోవడం....
ముడ్డి కడగడం మానుకొని డైపర్స్ వాడడం....
ఇంకెక్కడి ప్రేమలు... లాలనలు....
ఇక్కడినుండే మొదలు....
ఇక కాన్వెంట్లు..... రెసిడెన్సు స్కూళ్లు....
వాడికి ఎవడు చుట్టమో... ఎవడు పక్కమో తెలియని పరిస్థితి ....
ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీలేదు....
ఇంజనీరింగ్ చేయడం....
ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం.....
వాట్సాప్ లో చాటింగ్....
ఐ ఎం ఓ లో విజిటింగ్....
స్కైప్ లో వీడియో కాలింగ్....
అమేజాన్ ద్వారా షాపింగ్....
నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే.... వీరికదే ఆనందం....
పెళ్లి ముందురావడం.... అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొని పోవడం.....
ఇంకెక్కడి ప్రేమలు... ఆప్యాయతలు....
అయ్యా, అమ్మ సస్తే తప్ప....
కనీసం దాయాదులు పోయినా....
దగ్గరోడు సచ్చినా....
దయలేని దుస్థితి ....
చూడలేని పరిస్థితి ....
ఇంకెక్కడి బందాలు....
ఇంకెక్కడి బందుత్వాలు....
అందుకే....
కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది....
అందుకే రోజు రోజుకు ఓల్డ్ ఏజ్ హోం ల సంఖ్యలు పెరుగుతూ పోతున్నాయి.....
బాల్యం నుండే మార్పు రావాలి...
బందాలు పెరగాలి....
అమ్మమ్మ, నానమ్మ ల కథలు వినాలి....
తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి....
కుటుంబం లో ఉండే ఆనందం తెలపాలి....
అది మనింటినుండే ప్రారంభం కావాలి....
కలసి బోజనం చేసి.... కలసి ముచ్చటించడం నేర్పాలి....
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి....
మళ్ళీ ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం....🌹మీ ప్రియమైన మీ త్రుడు. పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ.....


Comments

Popular posts from this blog

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను . ఎప్పుడైనా ఎవరైనా తమ పాపక్షమాపణ నిమిత్తము సర్వలోక రక్షకుడైన యేసుని వెతుకుతుంటే.... వారు తెలుసుకోవలసిన విషయము ఏమిటంటే; యేసు కూడా వారి కోసము వెతుకుతున్నారు అని. చూడండి.... జక్కయ్య అనే వ్యక్తి ఉన్నారు.... ఈ జక్కయ్య యేసు కోసము వెతుకుచున్నారు; కానీ ఈ జక్కయ్యకి కూడా తెలియని విషయము ఏమిటంటే....? యేసు కూడా ఈ జక్కయ్య కోసమే వెతుకుతున్నారు. . . . అందుకే తన ముందు గుంపులు గుంపులుగా జనం ఉన్నా యేసు జక్కయ్య దగ్గరికి వచ్చి ఆగారు. అంతకుముందు యేసుని జక్కయ్య చూడలేదు.... వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవలేదు.... కానీ; యేసయ్యకు తెలుసు యెరికొలో మరోక ఆత్మ రక్షణ కోసం ఎదురుచూస్తుందని.... యేసయ్యకు తెలుసు అతను జనముచేత పాపిగా పిలువబడే సుంకపుగుత్తదారుడని.... యేసుక్రీస్తు వారికి తెలుసు అతను పొట్టివాడని; అందుకే చెట్టు ఎక్కాడని, అతని పేరు జక్కయ్య అని. . . . అందుకే వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవకపోయినా యేసయ్య అతనిని పేరు పెట్టి పిలిచారు. జక్కయ్య కోసము వెతుకుతూ అతను దాగివున్న చోట ఆగి మరీ పట్టుకున్నారు. అక్కడి ప్రజలు జక్కయ్య గురించి ఏమి అనుకుంటున...

Devinelu Stotrarhudaa Yesayya - Digiraanaiyuna Maharajvu Neevayya

దివినేలు స్తోత్రర్హుడా యేసయ్య  దిగిరానైయున్నా మహారాజువు నీవయ్య మొదటివాడవు కడపటివాడవు  యుగయుగములలో ఉన్నవాడవు 1.        మా నక నాయెడల కృప చూపుచున్నావు మారదు  నీ ప్రేమ తరతరములకు  మాటతప్పని మహనీయుడవు మార్పులేనివాడవు నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు నీ మాటలు జీవపు ఉటలు నీ కృపయే బలమైన కోటలు 2.        దా చక నీ సంకల్పము తెలియచేయుచున్నావు దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు దాటివెళ్లని కరుణామూర్తివై మనవి అలకించావు దీర్ఘశాంతముగలవాడవై దీవించువాడవు నీ దీవెన పరిమళ సువాసన నీ ఘనతే స్దిరమైన సంపద 3.       సి యోను శిఖరముపై ననునిలుపుటకై జే ష్ట్యుల    సంఘముగ నను మార్చుటకే   దివ్యమైన ప్రత్యక్షతతో నన్ను నిలిపియున్నావు సుందరమైన నీ పోలికగా రూపుదిద్దిచున్నావు నీ రాజ్యమే పరిశుద్ద నగరము ఆ రాజ్యమే నిత్య సంతోషము  

దేహము ప్రభువు నిమిత్తమే మరియు ప్రభువు దేహము నిమిత్తమే::

దేహము ప్రభువు నిమిత్తమే మరియు ప్రభువు దేహము నిమిత్తమే:: మన శరీరవిషయము కూడా పౌలు చెప్పుచున్నాడు. "నా శరీరేచ్ఛలను నామీద ప్రభుత్వము చెయ్యనివ్g వను"(1 కొరింథీ 6:12-13). ఆహారము మన శరీరమునకు ఎంతో అవసరము. నీవు దేవుని సేవకుడవు కావాలని కోరినట్లయితే, తినే విషయములో నీకు ఆశానిగ్రహము ఉండాలి. ఆహారము నీమీద ప్రభుత్వము చేయునంతగా నీవు దానిని ప్రేమించినట్లయితే, నీవు దేవునికి ఉపయోగకరమైన సేవకుడవు కాలేవు. ఆ బానిసత్వము నుండి విడుదల పొందాలి. ఈ విషయములో విశ్వాసము సహాయపడుతుంది. మనము క్రీస్తులో ఏకాత్మ అగుటయే కాక మన దేహము కూడా "క్రీస్తులో ఒక అవయవమైయున్నది"(1 కొరింథీ 6:15). కాబట్టి మన దేహముతో వ్యభిచారము చెయ్యకూడదు. మన కళ్ళు, మన నాలుక మరియు దేహములోని ప్రతి అవయవము ప్రభువు కొరకే. మన దేహమును గూర్చి ఒక అద్భుతమైన దేవుని వాగ్ధానము ఉన్నది. ఈ వాగ్ధానము నా అనుభవము అగునట్లు అనేక సంవత్సరముల నుండి ప్రార్ధించియున్నాను: "దేహము ప్రభువు నిమిత్తమే మరియు ప్రభువు దేహము నిమిత్తమే"(1 కొరింథీ 6:13). నీవు ఇలా చెప్పినట్లయితే "ఓ యేసుప్రభువా, నాదేహమంతయు తల నుండి అరికాలు వరకు నీదే - నా కళ్ళు, నా నా...