దేహము ప్రభువు నిమిత్తమే మరియు ప్రభువు దేహము నిమిత్తమే::
మన శరీరవిషయము కూడా పౌలు చెప్పుచున్నాడు. "నా శరీరేచ్ఛలను నామీద ప్రభుత్వము చెయ్యనివ్g వను"(1 కొరింథీ 6:12-13).
ఆహారము మన శరీరమునకు ఎంతో అవసరము. నీవు దేవుని సేవకుడవు కావాలని కోరినట్లయితే, తినే విషయములో నీకు ఆశానిగ్రహము ఉండాలి. ఆహారము నీమీద ప్రభుత్వము చేయునంతగా నీవు దానిని ప్రేమించినట్లయితే, నీవు దేవునికి ఉపయోగకరమైన సేవకుడవు కాలేవు. ఆ బానిసత్వము నుండి విడుదల పొందాలి. ఈ విషయములో విశ్వాసము సహాయపడుతుంది.
మనము క్రీస్తులో ఏకాత్మ అగుటయే కాక మన దేహము కూడా "క్రీస్తులో ఒక అవయవమైయున్నది"(1 కొరింథీ 6:15). కాబట్టి మన దేహముతో వ్యభిచారము చెయ్యకూడదు. మన కళ్ళు, మన నాలుక మరియు దేహములోని ప్రతి అవయవము ప్రభువు కొరకే.
మన దేహమును గూర్చి ఒక అద్భుతమైన దేవుని వాగ్ధానము ఉన్నది. ఈ వాగ్ధానము నా అనుభవము అగునట్లు అనేక సంవత్సరముల నుండి ప్రార్ధించియున్నాను: "దేహము ప్రభువు నిమిత్తమే మరియు ప్రభువు దేహము నిమిత్తమే"(1 కొరింథీ 6:13). నీవు ఇలా చెప్పినట్లయితే "ఓ యేసుప్రభువా, నాదేహమంతయు తల నుండి అరికాలు వరకు నీదే - నా కళ్ళు, నా నాలుక మరియు నా సర్వము నీదె". అప్పుడు ప్రభువు కూడా నీ దేహము కొరకు సర్వములో సర్వమైయుంటాడు. ఆయన కోరిన పరిచర్య నీవు చేయుటకు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. రోగము నుండి కూడా నీ దేహన్ని ఆయన కాపాడును. యౌవనస్థులు కూడా సొమ్మసిల్లవచ్చునేమో గాని తన దేహమును ప్రభువుకు సమర్పించుకొనువారు దేవునిశక్తిని పొందుకుని పక్షిరాజులవలె ఎగురుదురు.
మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నది(1 కొరింథీ 6:19). కాబట్టి దానిని అపవిత్రపరచకూడదు. నీవు మందిరములో సిగిరెట్ త్రాగవు లేక సారాయి త్రాగవు లేక వ్యభిచారము చేయవు. ఆవిధముగానే నీ దేహము నిజమైన ఆలయము కాబట్టి ఇట్టి వాటిని నీవు చేయవు. "మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరుచుడి"(1 కొరింథీ 6:20).
ఈ తొమ్మిది వచనములు(1 కొరింథీ 6:12-20) లేఖనములలోని ఒక అద్భుతమైన భాగమైయున్నది. ఎందుకనగా మన దేహమును ఎలా ఉపయోగించాలో మరియు మన దేహమునకు దేవుడు అనుగ్రహించిన వాటిని గూర్చి చెప్పబడింది. మనము దేవునిని సేవించుటకు ఆరోగ్యకరమైన దేహము కావాలి. కాబట్టి ఈ వాక్యభాగమును అనేకసార్లు ధ్యానించి ప్రార్ధంచాలని ప్రోత్సహించుచున్నాను.
అనేకమంది క్రైస్తవులు స్వస్థత గూర్చి మాట్లాడుచున్నారు. కానీ స్వస్థత కంటే ఆరోగ్యము శ్రేష్టము. రోగము వచ్చిన తరువాత స్వస్థతపొందుట కంటే ఆ రోగము రాకుండుటయే మేలు. మనము ఎక్కువగా తిని, రోగము తెచ్చుకుని స్వస్థత కొరకు దేవునిని అడుగుట కంటే, కొంచెం తక్కువగా తిని ఆరోగ్యముగా ఉండుట మేలు. స్వస్థతపరచమని ప్రభువును అడుగుట కంటే, ప్రభువే నీకు ఆరోగ్యమైయుండునట్లు ప్రార్ధించుము. నీవు ప్రభువునకు సమర్పించుకొని, ఆయనతో ఇట్లనుము, "ప్రభువా నీవు నా దేహనికి ఆరోగ్యమైయున్నందుకు స్తోత్రము. నేను ఈ భూమి మీద జీవించి మరియు నీ సేవ చెయ్యాలని నీవు కోరినంతకాలము నేను అందుబాటులో ఉంటాను. సిలువమీద నాకొరకు నీవు ఎంతో వెల చెల్లించి నన్ను కొనియున్నావు. కాబట్టి నా దేహముతో మహిమపరచెదను. నా దేహము నీకే చెందియున్నది"
మన దేహము ప్రభువుచేత కొనబడిన ఇంటివలె యున్నది. మనము ఆ ఇంటిని ఖాళీ చేసి మరియు ప్రభువునకు అప్పగించాలి. వేరేవారు కొనిన ఇంటిలో నివసించుట పాపము. నీ దేహము ప్రభువుకు సమర్పించుకొనుము.

Comments
Post a Comment