Skip to main content

✳ విగ్రహారాధన ✳

✳ విగ్రహారాధన ✳

👉 విగ్రహారాధన దేవునికి అత్యంత అసహ్యమైన చర్య.
👉విగ్రహారాధన అంటే?
విగ్రహాలను తయారు చేసుకొని, వాటికి కొబ్బరికాయలు కొట్టి, అరటి పళ్ళు పెట్టి, అగరబత్తీలు వెలిగించి వాటిని దేవునిగా పూజించడం.
అదేనా?
నీవు చెప్తావ్. నేను అట్లా చెయ్యడంలేదు. నేను ఎట్టి పరిస్థితులలోనూ విగ్రహారాధికుడను కాదని.
కాని, ఒక్క విషయం!
విగ్రహారాధన అంటే అది మాత్రమే కాదు.
👉 దేవుని కంటే ఎక్కువగా దేనికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'.
👉నీ హృదయం దేనితో నిండి పోయిందో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'.
➡ దేనికి ప్రాధాన్యత నిస్తున్నావ్?
నీ హృదయం దేనితో నిండిపోయింది?
•గాళ్ ఫ్రెండా?
•బాయ్ ఫ్రెండా?
•మోటార్ బైక్సా?
•వస్త్రాలా?
•సెల్ ఫోన్సా?
•బంగారమా?
•ధనమా?
•ఆస్థులా?
•అంతస్తులా?
•నీ పిల్లలా?
•అసూయా?
•ద్వేషమా? ఏది?
ఇవన్నీ విగ్రహాలే.
ఇప్పుడు చెప్పగలవా?
నేను విగ్రహారాధికుడను కాదని.
ఇట్లా టన్నుల కొద్దీ చెత్త మన హృదయంలో పేరుకుపోయినప్పుడు ఇక దేవునికి స్థానం ఎక్కడ?
ఏదో కాస్త ఖాళీ ఉంచినా? ఆ చెత్త మధ్య పరిశుద్దుడైన దేవుడు నివాసం చెయ్యగలడా?
అందుకే కదా!
సంవత్సరాలు నీ జీవితంలో దొర్లిపోతున్నా?
ఆయన నీ హృదయమనే తలుపునొద్ద(బయట) మాత్రమే నిలబడిపోవలసి వస్తుంది.
నేడే ఆ విగ్రహాలను తొలగించి నీ ప్రియ రక్షకుని లోనికి ఆహ్వానించగలవా?

✳ ఉదయం లేచినవెంటనే, యేసు ప్రభువు వారి ఫోటో చూసుకోవడం చాలామందికి ఒక అలవాటు.
ఇంతకీ ఆ ఫోటో యేసు ప్రభువు వారిదేనా?
ఎవరు తీసారు?
ఒక్క విషయం ఆలోచించు!
యేసు ప్రభువు వారు జన్మించి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది.
కెమెరా కనిపెట్టి రెండు వందల సంవత్సరాలు కూడా కాలేదు.
లియోనార్డ్ డావెన్సి 'ది లాస్ట్ సప్పర్' అనే అద్భుతమైన చిత్రంలో ఏసుప్రభువు వారు తన శిష్యులతో పస్కా ను భుజిస్తున్నట్లు చిత్రించాడు.
ఆయన యేసు ప్రభువు వారిని చూసాడా అంటే? లేదు. యేసు ప్రభువు పుట్టిన 1400 సంవత్సరాల తర్వాత పుట్టాడు.
యేసు ప్రభువును స్వయంగా చూచిన చిత్రకారుడెవరైనా ఆయన చిత్రాన్ని గీసారా అంటే? అట్లా జరగలేదు.
యేసు ప్రభువుగా చెప్పుకొంటున్న
ఆ రూపం ఈలోకంలోనికి ఎట్లా వచ్చింది?
యేసు ప్రభువు వారు సిలువ మీద మరణించిన తర్వాత ఆయన దేహం అరిమతయి యోసేపుకు ఇవ్వబడింది. అప్పుడు ఆయన ముఖాన్ని తెల్లని వస్త్రంతో తుడవగా, ఆయన ముఖస్వరూపం రక్తపు మరకల రూపంలో దాని మీద ముద్రించ బడింది.
తర్వాతి కాలంలో ఆ ముద్రికలను ఆధారం చేసుకొని 'బహుశ' యేసు ప్రభువు రూపం ఇట్లా వుండవచ్చేమో? అని ఒక ఊహా చిత్రం గీసారు. ఆ ఊహా చిత్రమే దేవుడై పోయాడు.
దానినే మందిరాలలోనూ, మన గ్రుహాల్లోనూ పెట్టుకొని ఆరాదిస్తున్నాం.
ఎవరో బొమ్మలను చేసుకొని పూజిస్తున్నారు అని చెప్పేనీవు, నీవు చేస్తున్నదేమిటో?
'దేనిరూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
నిర్గమ 20:4
ఆయన 'ఒక అనిర్వచనీయమైన అధ్వితీయ శక్తి'. ఆయన శక్తిని, ప్రేమను, ఉగ్రతను చిత్ర పటంలోగాని, విగ్రహంలోగాని, చూడలేవు.
దేవునికి చెందాల్సిన మహిమ వాటికి చెందడానికి వీలులేదు. అట్లా చేస్తే నీకంటే విగ్రహారాధికుడు మరెవ్వరూ లేరు.
'విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
ప్రకటన 21:8
వద్దు!
ఇది వినడానికే భయంకరం.
సరి చేసుకుందాం.
సాగిపోదాం.
గమ్యం చేరేవరకు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!

Comments

Popular posts from this blog

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను . ఎప్పుడైనా ఎవరైనా తమ పాపక్షమాపణ నిమిత్తము సర్వలోక రక్షకుడైన యేసుని వెతుకుతుంటే.... వారు తెలుసుకోవలసిన విషయము ఏమిటంటే; యేసు కూడా వారి కోసము వెతుకుతున్నారు అని. చూడండి.... జక్కయ్య అనే వ్యక్తి ఉన్నారు.... ఈ జక్కయ్య యేసు కోసము వెతుకుచున్నారు; కానీ ఈ జక్కయ్యకి కూడా తెలియని విషయము ఏమిటంటే....? యేసు కూడా ఈ జక్కయ్య కోసమే వెతుకుతున్నారు. . . . అందుకే తన ముందు గుంపులు గుంపులుగా జనం ఉన్నా యేసు జక్కయ్య దగ్గరికి వచ్చి ఆగారు. అంతకుముందు యేసుని జక్కయ్య చూడలేదు.... వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవలేదు.... కానీ; యేసయ్యకు తెలుసు యెరికొలో మరోక ఆత్మ రక్షణ కోసం ఎదురుచూస్తుందని.... యేసయ్యకు తెలుసు అతను జనముచేత పాపిగా పిలువబడే సుంకపుగుత్తదారుడని.... యేసుక్రీస్తు వారికి తెలుసు అతను పొట్టివాడని; అందుకే చెట్టు ఎక్కాడని, అతని పేరు జక్కయ్య అని. . . . అందుకే వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవకపోయినా యేసయ్య అతనిని పేరు పెట్టి పిలిచారు. జక్కయ్య కోసము వెతుకుతూ అతను దాగివున్న చోట ఆగి మరీ పట్టుకున్నారు. అక్కడి ప్రజలు జక్కయ్య గురించి ఏమి అనుకుంటున...

Calvary