యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;
ప్రసంగి 11:9
ఇంతకీ, ఎటువైపు నీ చూపులు?
ఏంటి నీ కోరికలు?
అమ్నోను చూపులు చెల్లెలు మీదకు మళ్ళాయట. చింతాక్రాంతుడై తన కోరిక చేత చిక్కిపోతున్నాడట.
2 సమూ 13:2
చివరకి తాను కోరుకున్నట్లే చేసాడు. ఫలితం? ప్రాణం కోల్పోయాడు.
చిన్న కుమారుని చూపులు రంగుల ప్రపంచం మీదకు మళ్ళాయట.
ఏమయ్యింది?
ఫలితం? పందులపొట్టే ఆహారం.
లూకా 15:16
దేవునిచేత ఏర్పరచబడిన సంసోను చూపులు వేశ్య మీదకు మళ్ళాయట. (న్యాయాధి 16:1)
ఏమయ్యింది?
సింహాన్ని సహితం చీల్చి వేసినవాడు, పచ్చి గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపినవాడు, మూడు వందల నక్కలను పట్టుకొని శత్రువుల పొలాలను నాశనం చేసినవాడు,
ఇప్పుడు, ఏ కళ్ళు అయితే ఆ వేశ్యను చూసాయో? ఆ రెండు కళ్ళూ పెరికి వేయబడ్డాయి. దాగోను దేవతకు బలి పశువుగా నిలబడ్డాడు.
దీనా చూపులు లోకం మీదకు మళ్ళాయట. దీనా ఆదేశ కుమార్తెలను చూడాలనుకుంది.
ఆది 34:1
ఏమయ్యింది?
ఆ దేశ రాజకుమారుడు ఆమెను చూసాడు, పాడుచేసాడు. తద్వారా దీనా అన్నలు హంతకులుగా మార వలసివచ్చింది.
ఒక్కసారి ఆలోచించు!!
వీళ్ళంతా లోకాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళే. కాని వారిఅంతం ఎట్లా వుంది? నీ జీవితం సంతోషంగా, సాఫీగానే సాగిపోతుందిలే అనుకొంటున్నావా? కాని, దాని అంతం మాత్రం ఘోరంగా వుంటుంది. ఆ దినాన్న మాత్రం తప్పించుకోలేవు. అల్పకాల సుఖ భోగాలను చూసుకొని నిత్య రాజ్యాన్ని కాళ్ళతో తన్నేస్తావా?
యోసేపు పవిత్రమైన జీవితాన్ని జీవించ గలిగాడు. ఇస్సాకు దేవుని కోసం అర్పణగా మారడానికి సిద్ధపడ్డాడు. యోప్తా కుమార్తె దేవునికోసం అర్పణగా మార్చబడింది.
వారి జీవితాలు ధన్యమయ్యాయి.
చివరిగా ఒక్క మాట!
ఆనందం ఎక్కడ వుందో తెలుసా?
అది యేసయ్యలోనే.
యేసయ్యలో ఆనందం
సమాధానకరమైనది.
అది శాశ్వతమైనది.
యౌవనుడా!
ఎంజాయ్ చెయ్ యేసయ్యతోనే!!

Comments
Post a Comment