Skip to main content

విధేయత

విధేయత

LTTE అధినేత ప్రభాకరన్ ను అమెరికన్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు.
జర్నలిస్ట్: ఇంత తక్కువ సైన్యంతో దేశమునే వణికిస్తున్నారు ఎట్లా సాధ్యము?
ప్రభాకరన్: 'విధేయత'
జర్నలిస్ట్ : మా సైన్యం కూడా విధేయతతోనే వుంటుంది. మీ విధేయతలో ప్రత్యేకత ఏమిటి?
ప్రభాకరన్: అతనికి తన సైన్యం పేర్లున్న బుక్ ఒకటిచ్చి, ఇద్దరు పేర్లు పిలవమన్నాడు. పిలవగా, ఆ ఇద్దరూ పరుగులెత్తుకొంటూ వచ్చారు. వారితో చెప్పాడు ప్రభాకరన్ మీ ఇద్దరూ చచ్చిపొండి. వెంటనే వారేమి ప్రశ్నించ లేదు. తమ మెడలో నున్న పోటాషిం సైనైడ్ ప్యాకెట్స్ నోటిలో వేసుకొని గిలగిలా తన్నుకొంటూ చచ్చిపోయారు.
మరొక ఇద్దరి పేర్లు పిలవమన్నాడు. జర్నలిస్ట్ భయపడుతూ మరొక ఇద్దరి పేర్లు పిలిచాడు. వారూ పరుగులెత్తుకొంటూ వచ్చారు. వారితో చెప్పాడు ప్రభాకరన్ వీళ్ళను తీసుకొనివెళ్లి సమాధి చెయ్యండని. వారు ఏమి జరిగిందని ఒక్క మాట కూడా ప్రశ్నించకుండా తీసుకొని వెళ్లి సమాధిచేసారట.
ప్రభాకరన్ చెప్పాడు 'విధేయత' అంటే ఇది.

అవును! విధేయత 'ప్రశ్నించదు'.

అయితే, ఒక్క విషయం?
ఒక మనిషి, ప్రాణంతీసే మరో మనిషికి అంత విధేయత చూపగలిగితే?
ప్రాణం పెట్టిన ప్రియరక్షకునికి ఇంకెంత విధేయత చూపగలగాలి?

నీవు నీకు నచ్చినట్లుగా జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు పొందలేవు. ఒకవేళ, నీకు నచ్చినట్లుగా నీవు జీవిస్తున్నప్పటికీ సాఫీగానే నీ జీవితం సాగిపోతుందా? చదువులోను, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ బాగానే రాణించ గలుగు తున్నావా? దానిలో నీ జీవితానికి సమాధానం మాత్రం  వుండదు. ఎంతో కాలం రాణించలేవు కుడా.
దేవుని మాటకు విధేయత చూప గలిగితే దేవుడు నిన్ను, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ దేశాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయనిచ్చే ఆశీర్వాదం సమాధానమైనది, శాశ్వతమైనది.

సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను.
              లూకా 5:5

పేతురు అంటున్నాడు. రాత్రంతా నా ప్రయత్నం నేను చేసాను. ఫలితం శూన్యం. కారణం? అప్పటికి  పేతురు దోనెలో యేసు ప్రభువు వారు లేరు.

"అయినప్పటికీ", నీవు చెప్పినట్లే చేస్తాను.
నిజానికి, యేసు ప్రభువు మాట పేతురు వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే? యేసు ప్రభువు వారు వడ్రంగి కుటుంబములో పెరిగారు. పేతురు మత్స్య కారుల కుటుంబములో పెరిగిన వాడు. చేపలు ఎక్కడ ఉంటాయో? పేతురుకే బాగా తెలుసు.

కాని, యేసు ప్రభువు వారు సమస్తమూ ఎరిగినవాడు అని పేతురు గ్రహించ గలిగాడు. ఆ గ్రహింపే విధేయతకు కారణమయ్యింది. ఆ విధేయతే అద్భుతాన్ని చూడగలిగింది. అంతేకాదు, అతని దోనెతోపాటు ప్రక్క దోనె కూడా చేపలతో నిండిపోయింది.

రాత్రంతా దేనికోసం కష్టపడ్డాడో అవి విస్తారంగా దొరికాయి. ఇప్పుడు వాటిని తీసుకొనివెళ్లి అమ్ముకోవాలి. కాని, వాటన్నింటిని విడచిపెట్టి ఆయనను వెంబడిస్తున్నాడు.
కారణం? ఆశీర్వాదాలకుకర్త తనతోవుంటే? ఇక ఆశీర్వాధాలతో పనేముంది?

అవును! ఇంత వరకూ నీ జీవిత దోనెలో యేసు ప్రభువు వారికి స్థానం లేకుండా నీ ప్రయత్నాలు నీవు చేసి, అలసిపోయావేమో?  ఓడిపోయావేమో? నేడైనా ఆయన శక్తిని గ్రహించి, నీ హృదయంలో చేర్చుకొని, ఆయన మాటకు విధేయత చూపగలిగితే? నీవే కాదు నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్నుబట్టి నీ పొరుగువారు కూడా ఆశీర్వధించ బడతారు. అట్లా అని, కేవలం ఆశీర్వాదాలను స్వంతం చేసుకొనే ప్రయత్నం కాదుగాని, ఆశీర్వాదాలకుకర్త అయిన ఆయనను స్వంతం చేసుకోగలగాలి.
అప్పుడు నీవే ఒక ఆశీర్వాదపు నిధిగా మార్చబడతావు.

మనస్పూర్తిగా ఒక మాట చెబుదాము.
ప్రభువా! నా జీవితమంతా నీవు లేకుండా, నిన్ను కాదని ప్రయాస పడ్డాను. ఏమి సాధించలేకపోయాను, సమాధానాన్ని కోల్పోయాను. ఇప్పుడు నీ చిత్తానికి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను.
అంగీకరించు! ఆశీర్వాధించు!

*ఆమెన్ జీసస్.

Comments

Popular posts from this blog

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను . ఎప్పుడైనా ఎవరైనా తమ పాపక్షమాపణ నిమిత్తము సర్వలోక రక్షకుడైన యేసుని వెతుకుతుంటే.... వారు తెలుసుకోవలసిన విషయము ఏమిటంటే; యేసు కూడా వారి కోసము వెతుకుతున్నారు అని. చూడండి.... జక్కయ్య అనే వ్యక్తి ఉన్నారు.... ఈ జక్కయ్య యేసు కోసము వెతుకుచున్నారు; కానీ ఈ జక్కయ్యకి కూడా తెలియని విషయము ఏమిటంటే....? యేసు కూడా ఈ జక్కయ్య కోసమే వెతుకుతున్నారు. . . . అందుకే తన ముందు గుంపులు గుంపులుగా జనం ఉన్నా యేసు జక్కయ్య దగ్గరికి వచ్చి ఆగారు. అంతకుముందు యేసుని జక్కయ్య చూడలేదు.... వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవలేదు.... కానీ; యేసయ్యకు తెలుసు యెరికొలో మరోక ఆత్మ రక్షణ కోసం ఎదురుచూస్తుందని.... యేసయ్యకు తెలుసు అతను జనముచేత పాపిగా పిలువబడే సుంకపుగుత్తదారుడని.... యేసుక్రీస్తు వారికి తెలుసు అతను పొట్టివాడని; అందుకే చెట్టు ఎక్కాడని, అతని పేరు జక్కయ్య అని. . . . అందుకే వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవకపోయినా యేసయ్య అతనిని పేరు పెట్టి పిలిచారు. జక్కయ్య కోసము వెతుకుతూ అతను దాగివున్న చోట ఆగి మరీ పట్టుకున్నారు. అక్కడి ప్రజలు జక్కయ్య గురించి ఏమి అనుకుంటున...

Calvary