యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము; ప్రసంగి 11:9 ఇంతకీ, ఎటువైపు నీ చూపులు? ఏంటి నీ కోరికలు? అమ్నోను చూపులు చెల్లెలు మీదకు మళ్ళాయట. చింతాక్రాంతుడై తన కోరిక చేత చిక్కిపోతున్నాడట. 2 సమూ 13:2 చివరకి తాను కోరుకున్నట్లే చేసాడు. ఫలితం? ప్రాణం కోల్పోయాడు. చిన్న కుమారుని చూపులు రంగుల ప్రపంచం మీదకు మళ్ళాయట. ఏమయ్యింది? ఫలితం? పందులపొట్టే ఆహారం. లూకా 15:16 దేవునిచేత ఏర్పరచబడిన సంసోను చూపులు వేశ్య మీదకు మళ్ళాయట. (న్యాయాధి 16:1) ఏమయ్యింది? సింహాన్ని సహితం చీల్చి వేసినవాడు, పచ్చి గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపినవాడు, మూడు వందల నక్కలను పట్టుకొని శత్రువుల పొలాలను నాశనం చేసినవాడు, ఇప్పుడు, ఏ కళ్ళు అయితే ఆ వేశ్యను చూసాయో? ఆ రెండు కళ్ళూ పెరికి వేయబడ్డాయి. దాగోను దేవతకు బలి పశువుగా నిలబడ్డాడు. దీనా చూపులు లోకం మీదకు మళ్ళాయట. దీనా ఆదేశ కుమార్తెలను చూడాలనుకుంది. ఆది 34:1 ఏమయ్యింది? ఆ దేశ రాజక...